వైసీపీ వీడుతారని వార్తలు.. కొట్టిపారేసిన అలీ
1 min read

పల్లెవెలుగువెబ్: వైసీపీకి అలీ గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై అలీ తాజాగా స్పందించారు. తాను వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అలీ తేల్చి చెప్పారు. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన అలీ… అయినా వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తాను వేరే పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వైసీపీలో తాను చేరింది పదవుల కోసం కాదని అలీ చెప్పారు. జగన్ ను సీఎం చేయాలనే లక్ష్యంతోనే తాను వైసీపీలో చేరానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానమే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

