చంద్రబాబుపై అక్రమ కేసులు సిగ్గుచేటు
1 min read– వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు బనాయిస్తూ జైలుకు పంపడం సిగ్గుచేటు అని రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గిత్త జయసూర్య,టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి అన్నారు.సోమవారం మిడుతూరు మండల కేంద్రమైన పార్టీ కార్యాలయంలో టిడిపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.మిడుతూరు మండలంలో కాత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో చింతలపల్లె, సుంకేసుల,రోళ్ళపాడు, వీపనగండ్ల గ్రామాల్లో భవిష్యత్ గ్యారెంటీ,బాబుతో నేను,ఓటర్ల లిస్టులో ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని అన్నారు.చంద్రబాబు తప్పు చేయకున్నా కేసులు పెడుతూ మానసికంగా భయపెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తూ ఉందని ఇదంతా ప్రజలు గమనించాలని ఎన్నికలు సమీపిస్తున్నాయని వచ్చే ఎన్నికల్లో విద్యావంతులు యువకులు మహిళలు ప్రజలు ఆలోచించి టిడిపి పార్టీకి పట్టం కట్టాలని అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా విపరీతంగా ధరలు పెంచారని చంద్రబాబుపై కేసులు ఎప్పుడు నమోదు చేద్దామా అనే తలంపు వారిలో ఎక్కువగా ఉందని కేసులపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి వైపు చూపండి అని వారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.గ్రామాల్లో ఉన్న ఇంటింటికి వెళ్ళుతూ టిడిపి కరపత్రాలను ప్రజలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పగిడాల మండల కన్వీనర్ మహేశ్వర రెడ్డి,నందికొట్కూరు మైనార్టీ నాయకుడు జలీల్ మరియు ఆయా గ్రామ నాయకులు చింతలపల్లె మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి,ఐటిడిపి మండల కన్వీనర్ ఇంతియాజ్,విష్ణువర్ధన్ రెడ్డి,సుబ్బరావు,నారాయణ, సుభాన్,లక్ష్మీ నారాయణ,రవి కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.