NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటు సారా పై దాడులు…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శనివారం ఓర్వకల్లు మండలం గుమితం తాండ లో నవోదయం కార్యక్రమంలో భాగంగా నాటు సారా పై దాడులు నిర్వహించడం జరిగినది ఈ దాడులలో సుమారు 900 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగపడు బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగినది అనంతరం గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించి నాటు సారావలన వచ్చు అనర్థాల గురించి వివరించి నాటు సారాను పూర్తిగా నిర్మూలించాలని నాటుసారా లేని గ్రామంగా తీర్చిదిద్దాలని వివరించి,తదుపరి ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు కావాలని తెలియజేయడమైనది.ఇకమీదట ప్రతినిత్యము నాటు సారా పై దాడులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ నాటు సారాను పూర్తిగా మానివేసి ఇతర ఉపాధి కార్యక్రమంలో నిమగ్నం కావలసినదిగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ ఈఎస్టిఎఫ్ సిఐ రాజేంద్రప్రసాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ మరియు సిబ్బంది రామలింగ చంద్రపాల్, ఈరన్న రాజు, శ్రీనివాసగౌడు, మధు, (ఈ ఎస్ టి ఎఫ్) తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *