NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్ద పీట…

1 min read

రాష్ట్రవ్యాప్తంగా తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు…

న్యూస్ నేడు హొళగుంద:  సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కూటమి నాయకులు…చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు తల్లికి వందనం పేరిట విద్యార్థుల విద్యాభివృద్ధికి విద్యార్థుల తల్లుల ఖాతాలో ఒక్కొక్కరికి 13000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక బస్టాండ్ నందు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, కూటమి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు కేవలం ఒక విద్యార్థికి మాత్రమే అమ్మ ఒడి పేరుతో 13 వేల రూపాయలు ఇచ్చారని, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న అందరికీ తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి 13000 రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వృద్ధాప్య వితంతు పెన్షన్లను 3000 నుంచి 4 వేలకు, వికలాంగులకు 3000 నుంచి 6 వేలకు పెంచడం జరిగిందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి బిటి రోడ్లు, సిసి రోడ్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే దక్కుతుంది అని అన్నారు. పేదలకు నాణ్యమైన భోజనం అందించే 204 అన్న క్యాంటీన్ లను నా ప్రారంభించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా జూన్ నెలలోనే రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి తో పాటు సమానంగా ప్రజా సంక్షేమానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పంపాపతి,జాకీర్,మాజీ ఎంపిటిసి ఈరప్ప, మల్లి,రాము, సిబిఎన్ ఆర్మీ మండల అధ్యక్షుడు ముల్లా మోయిన్,సీనియర్ నాయకులు అబ్దుల్లా సాబ్, తోక వెంకటేష్, బిజెపి నాయకులు చిదానంద,కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *