ఘనంగా మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ప్యాపిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఏఎస్ఐ మురళి కృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నితిన్ పాటి మరియు సిబ్బంది ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఆర్టిస్ట్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడకూడదని ఒకవేళ మీ గ్రామాల లో ఎవరైనా ఉపయోగిస్తూ ఉంటే వారి వివరాలు రహాస్యంగా పోలీస్ లకు తెలియజేయవలసీన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని విద్యార్థులకు సూచించాడు.ఈ కార్యక్రమంలో లెక్చరర్స్సత్య బాబు,ఓబులేసు,మురళి, మోహన్ గౌడ్,వెంకటరమణ, మద్దిలేటి,వెంకటేశ్వర్లు, ముస్తాక్,శంకరయ్య,మంజునాథ్,మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.


