ప్యాపిలి డిప్యూటీ తాసిల్దార్ గా కిషోర్ కుమార్ రెడ్డి
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండల డిప్యూటీ తహసీల్దార్ గా కిషోర్ కుమార్ రెడ్డి శుక్రవారం నూతన బాధ్యతలు చేపట్టారు.ఈయన మిడుతూరు మండల తాసిల్దార్ కార్యాలయం లో విధులు నిర్వహిస్తూ ఉన్నత బదిలీపై ప్యాపిలికి బదిలీనట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్యాపిలి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దారు గత ఆరు నెలల నుంచి ఖాళీగా ఉండడంతో బదిలీపై డిప్యూటీ తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు తమ వంతు సహకారాలు అందిస్తూ తోటి సిబ్బందికి విధులలో ఆటంకాలు కలకుండగా సక్రమంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

