NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గణిత శాస్త్ర విభాగానికి చెందిన పలువురి అధ్యాపకులకు డాక్టరేట్ లు

1 min read

నయా రాయపూర్ లో కళింగ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు

అభినందించిన కళాశాల ప్రిన్సిపల్ డా:సిస్టర్ పి.మెర్సి, వైస్ ప్రిన్సిపాల్

సెయింట్ థెరీసా మహిళా కళాశాలలో సంబరాలు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : స్థానిక సెయింట్ థెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల గణిత శాస్త్ర విభాగానికి చెందిన ముగ్గురు అధ్యాపకులు చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని నయా రాయపూర్ లో కళింగ యూనివర్సిటీ నుంచి2025 జూన్ నెలలో డాక్టరేట్  పట్టాలను పొందారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ కళాశాలలో 25 మంది అధ్యాపకులు డాక్టరేట్ పట్టాలు కలిగి ఉన్నారని, ఇప్పుడు అదనంగా ముగ్గురు  అధ్యాపకులు డాక్టరేట్ పట్టాను పొందడం తమకు గర్వ కారణమన్నారు.గణితశాస్త్ర విభాగంలోని ఏ దుర్గాదేవి” సమ్ రిజల్ట్స్ ఆన్ ఈవెన్ మినీనైజేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ లేబరింగ్”అంశంపై  డాక్టర్ జి.వి.వి జగన్నాధరావు  మార్గదర్శకత్వంలో, ఏ జ్యోతి ” ఏ స్టడీ ఆన్ ఆల్జీబ్రిక్ గ్రాఫ్స్ విత్ ఫజ్జి ఐడియల్స్ అండ్ మాడ్యూల్స్” అనే అంశంపై డాక్టర్ రిషికాంత్ అగ్నిహోత్రి  మార్గదర్శకత్వంలో, గార్లపాటి జ్యోతి ” మ్యాథమెటికల్ మోడల్ ఇన్ యూనిక్నెస్ ఇన్ నాన్ లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్” అనే అంశంపై ప్రొఫెసర్ ప్రధాన్ మార్గదర్శకత్వంలో పీహెచ్డీ పట్టాలను సాధించారు.  కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి మెర్సి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి సునీల రాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల ఇతర అధ్యాపకులు వీరిని అభినందించారు.

About Author