NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్చక ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేసిన ఏలూరు ఎమ్మెల్యే

1 min read

పాల్గొన్న ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు

అభినందించిన పలువు రక్షకులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : స్థానిక 8 వ డివిజన్ తూర్పు వీధిలో లో ఉన్న శ్రీ ఓం నమః శివాయ శ్రీరామ మందిరమునకు అర్చక స్వామిగా నియమితులైన శ్రీ ఆర్.శ్రీనివాస్ చక్రవర్తి కి శుక్రవారం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్,ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు సువర్ణ హస్తాల మీదుగా అర్చక ఉద్యోగ నియామక పత్ర ప్రధానము శివయ్య గుడి ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, శివయ్య గుడి సంధు అభివృద్ధి కమిటీ సభ్యులు మద్దుల సత్య కుమార్, మద్దుల నాగేష్, బూర్లగడ్డ భద్రం,మాడా సుబ్బారావు,కనిగొళ్ళ రాజేష్, ఇనమూరి స్వామి,మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన,తెలుగుదేశం పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. పలువు అర్చకులు ఆయనను అభినందించారు.

About Author