ఇంద్రకీలాద్రి కళా వేదికలో చిన్నారుల భరతనాట్య ప్రదర్శన
1 min read

కూటమి ప్రభుత్వం కళలను ప్రోత్సహించే ప్రభుత్వం
విజయవాడ, న్యూస్ నేడు : కూటమి ప్రభుత్వం కళలను ప్రోత్సహించే ప్రభుత్వమని నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ స్పష్టం చేశారు.ఇంద్రకీలాద్రి కళా వేదికలో చిన్నారుల భరతనాట్య ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యు.ఎస్.ఎ కు చెందిన ఉషా గొట్టేటి శిష్య బృందం 13 మంది చిన్నారులు అమ్మవారి సన్నిధిలో నర్తించడం తనకు ఆనందం కలిగించిందన్నారు. ప్రభుత్వం దేవాలయాలలో సాంప్రదాయ కళలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.దుర్గమ్మ సన్నిధిలో గురువారం కళావేదికపై అభినయ ఆర్ట్స్ హైదరాబాద్ చిన్నారులు భరతనాట్య ప్రదర్శనతో అమ్మవారి భక్తులను ఆనందింపజేశారు. వినాయక స్తోత్రం, జతిశ్వరం, కృష్ణ శబ్దం, దుర్గా తరంగం, శివాష్టకాలను నృత్య రూపంలో ప్రదర్శించారు. నాటకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, ముంబై తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధార్థ రెడ్డిలు నృత్య ప్రదర్శనను వీక్షించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సాంప్రదాయకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రత్యేకంగా దేవాలయాలలో సాంప్రదాయ కళలను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం నాట్య ప్రదర్శన చేసిన చిన్నారులకు అమ్మవారి ప్రసాదాలను అందజేసి అభినందించారు.


