మీరే పనులు చేసుకుంటే ఎమ్మెల్యే ఎందుకు.?
1 min read

అధికారులు అందుబాటులో ఉండడం లేదు
కిందిస్థాయి అధికారులు గాడి తప్పుతున్నారు
వీఆర్వోలకు చార్జీ మెమో జారీ చేయాలన్న ఎమ్మెల్యే
అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే ప్రశ్నలతో ముచ్చె మటలు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : అధికారులూ మీరంతకు మీరే పనులు చేసుకుంటూ పోతే ఇక నేను ఎందుకని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్ ప్రజల నుండి ఎమ్మెల్యే ఫిర్యాదులను స్వీకరించారు.ముందుగా వివిధ శాఖల మండల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.శాఖల వారీగా మాట్లాడుతుండగా ప్రతి శాఖ అధికారికి కూడా ఎమ్మెల్యే ప్రశ్నలతో ఉండటంతో అధికారులు సమాధానాలు చెప్పలేకపోయారు.
అధికారులపై నాకు ఫిర్యాదులొస్తున్నాయ్
అధికారులు పనిచేయడం లేదని స్వయంగా ప్రజలు నాకు ఫోన్ లో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. కొందరు అధికారులు అందుబాటులో ఉండడం లేదు సమయపాలన లేదు మీరేం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండల అధికారులందరూ మండల కేంద్రాల్లో ఉండాల్సిందేనని పై స్థాయి అధికారులు లేకపోతే కిందిస్థాయి అధికారులు గాడి తప్పుతున్నారంటూ అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు.విద్యుత్తు, రెవెన్యూ,వ్యవసాయ శాఖ,విద్యాశాఖ,పంచాయతీ రాజ్,అంగన్వాడీ,గృహ నిర్మాణ శాఖ,ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలపై ఎమ్మెల్యే మండిపడ్డారు.గ్రామాల్లో అధికంగా నీటి సమస్య ఉంటే నాకెందుకు చెప్పలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు.విద్యుత్తు సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని,మండలంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు బాడుగలో ఉన్నాయని అంతే కాకుండా ఎంతమంది పిల్లలు వస్తున్నారు పిల్లలు తక్కువగా వస్తున్నారని సూపర్వైజర్లు అనడంతో పిల్లలు కేంద్రాలకు వచ్చే విధంగా సంఖ్య పెంచాలని అన్నారు.
వీఆర్వోలు అందరికీ చార్జి మెమో ఇవ్వండి
సమావేశపు హాల్లో లేనందున బాలన్న మినహా మిగతా విఆర్వోలకు చార్జీ మెమో జారీ చేయాలని తహసిల్దార్ శ్రీనివాసులును ఆదేశించారు. మిడుతూరు-గార్గేయపురం రోడ్డు మంజూరు అయ్యింది కానీ కాంట్రాక్టర్ వెనక్కి వెళ్లారని రాష్ట్రంలోనే నందికొట్కూరుకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నదే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. మండలంలో నూతన గృహాల నిర్మాణంలో సంఖ్య తగ్గితే హౌసింగ్ఏఈ,తహసిల్దార్ బాధ్యత వహించాలని సరైన సమయంలో ప్రజలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తహసిల్దార్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.గూడు లేని ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
పీఎస్ లు,వీఆర్వోలు సమన్వయంతో పని చేయండి
గ్రామాల్లో ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలు సమన్వయంతో గ్రామ అభివృద్ధికి ముందుకు వెళ్లాలని గ్రామాల్లో ప్రజలను అదేపనిగా తిప్పుకోకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామాల్లో ఏమి జరుగుతుందనేది మండల అధికారులకు కూడా తెలియడం లేదని ఎమ్మెల్యే అన్నారు.
సమస్యలు పరిష్కారం కావడం లేదన్న నాయకులు
అధికారులకు అర్జీలు ఇచ్చి రెండు మూడు నెలలు అయినా సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని వివిధ గ్రామాల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు దీనిపై ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. నందికొట్కూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుండి రేషన్ డీలర్లకు బియ్యం తక్కువగా వస్తున్నాయని అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.


