ఎంఈఓ శ్రీనాథ్ సేవలు.. అమోఘం
1 min read

పదవీ విరమణ చేసిన మిడుతూరు ఎంఈఓ..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : మిడుతూరు మండల విద్యాశాఖ అధికారి-2 కరణం శ్రీనాథ్ సేవలు అమోఘమని అధికారులు ప్రజా ప్రతినిధులు అన్నారు.సోమవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి హృదయ రాజు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది సర్వ సాధారణం అని అన్నారు. ప్రభుత్వ పరంగా రావలసిన సదుపాయాలు అన్నిటినీ కూడా త్వరగా వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు.26.06.1990 లో ఉపాధ్యాయుడిగా ఆ తర్వాత పుసులూరు,ఉలిందకొండ, కంబాలపాడులో పని చేశానని19.6.2023 న మిడుతూరు ఎంఈఓ గా పదోన్నతిపై వచ్చానని ఎంఈఓ శ్రీనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ గత 35 సం.గా ఉపాధ్యాయుడిగా అంచలంచలుగా ఎదుగుతూ ఎంఈఓ దాకా ఎదిగారని అన్నారు.మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఎంపీడీవో దశరథ రామయ్య,కమతం రాజశేఖర్ రెడ్డి ఆయన సేవలను కొనియాడారు.మంచి వ్యక్తి మృదు స్వభావం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించే ఎంఈఓ పదవీ విరమణ చేయడం పట్ల ఎంఈఓ దంపతులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఎంఈఓ ఫైజున్నిసా బేగం, రిటైర్డ్ ఎంఈఓ మౌలాలి,తువ్వా భగీరథ రెడ్డి, నందికొట్కూరు ఎంఈఓ సుభాన్ అన్నారు.తర్వాత ఎంఈఓ శ్రీనాథ్ పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరిస్తూ బహుమతులను అందజేశారు.అంతే కాకుండా కంబాలపాడు,ఉలిందకొండ పూర్వపు విద్యార్థులు వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాణ్యం ఎంఈఓ ఎం సుబ్రహ్మణ్యం,తహసిల్దార్ శ్రీనివాసులు,రామిరెడ్డి,మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి,ఏఎస్ఐ హరి ప్రసాద్, కేజీబీవీ ఎస్ఓ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు కే సింధు, అశోక్,హిమబిందు,ప్రశాంత్, శృతి పాల్గొన్నారు.


