బాలాసదనంలో 15 మంది పిల్లలకు వైద్య చికిత్సలు, మందులు పంపిణీ
1 min read

జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
వ్యక్తిగత పరిశుభ్రత,ఆరోగ్య సంరక్షణ పై సలహాలు సూచనలు
జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్:కె.నరేంద్ర కృష్ణ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని వారి ఆదేశములు మేరకు ఏలూరు జిల్లా దెందులూరు నందు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గల బాల సదనం నందు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు గల జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం నందు గల వైద్య సిబ్బంది బాల సదనం నందు గల 15 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా ప్రోగ్రాం అధికారి డా:కె.నరేంద్ర కృష్ణ సోమవారం తెలిపారు. అలాగే వారికి వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్య సంరక్షణ గురించి సలహాలు మరియు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తిన యెడల ఏలూరు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం కి తీసుకురాల్సిందిగా తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి.అమర్ కోటేశ్వర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

