NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు సకాలంలో అన్నం పెట్టని వంట ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి

1 min read

విద్యార్థులకు సకాలంలో అన్నం పెట్టని వంట ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని ఖాళీ ప్లేట్ లతో ఏఐఎస్ఎఫ్ ధర్నా

ఎమ్మిగనూరు న్యూస్​ నేడు:   ఏమైనా ప్రభుత్వ జూనియర్  బాలుర కళాశాలలో విద్యార్థులకు సకాలంలో భోజనం పెట్టకుండా కడుపు కాల్చిన వంట ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని సోమవారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కడుపు కాలిన విద్యార్థుల తో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా  చేయడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు విష్ణు, హాజీ బాబా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో మధ్యాహ్నం 12:40 కి విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన ఏజెన్సీ 2:00  గంటలు కావస్తున్న అన్నం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో కాళీ ప్లేట్లు తీసుకుని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారు తెలిపారు. పైగా ఈ వంట ఏజెన్సీ ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాలకు ఒక ఏజెన్సీ ఉండడంతో సకాలంలో విద్యార్థులకు అన్నం పెట్టలేకపోతున్నారని కాబట్టి తక్షణమే వంట ఏజెన్సీను ప్రభుత్వ జూనియర్ హై స్కూల్ కు మరియు ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలకు వేరువేరుగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నాగరాజు, వీరస్వామి, రాజు, రంగన్న, హర్షవర్ధన్, మల్లికార్జున, మహేష్, ఉమేష్,   విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author