NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రిటైర్డ్ అయిన ఆరు మంది ఆర్టీసీ డ్రైవర్ల కి ఘనంగా సన్మానం

1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఏపీఎస్ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపోలో  సోమవారం నాడు ఆరు మంది డ్రైవర్లు రిటైర్డ్ అయిన సందర్భంగా ముఖ్యఅతిథిగా వైయస్సార్ పార్టీ నాయకుడు రుద్ర గౌడ్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ కి నాకు చాలా సంబంధాలు ఉన్నాయని ఇదివరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ కు నేను గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించాలని చాలామంది మేము చిన్నగా ఉన్నప్పుడు టీచర్లు రిటైర్డ్ అయితే కట్ట పట్టుకుని వచ్చి కార్యక్రమానికి హాజరై రిటైర్డ్ అయ్యే వారిని ఎమ్మిగనూరు డిపోలో డ్రైవర్ గా పనిచేసి వీరందరూ ఇంకా ఆయురారోగ్యాలతో ఉన్నారని వీరిని చూస్తే ఇంకా డ్రైవర్ ఉద్యోగానికి అర్హులేనన్నట్లు ఉన్నారని దేవుడు వీరికి మరీ ఆయురారోగ్యాలు ప్రసాదించి చల్లగా చూడాలని దీవించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ది శ్రీ మద్లేటి నాయుడు, హిట్లర్కు పంపాపతి , ఇన్చార్జి సీఐ ఎల్లప్ప , నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్ష,కార్యదర్శి ఎస్. ఎం. రఫిక్, ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఎం .ఎస్ .వాసులు హెడ్ కానిస్టేబుల్ నారాయణ, మెకానిక్ మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో. దాదాపుగా 39 సంవత్సరాలు పనిచేసే రిటైర్డ్ అవుతున్నటువంటి బి.రంగన్న, ఏ. ఆనంద్ రాజు, యు. నరసయ్య, ఎన్. ఎస్. ఈరన్న, బి. రఫిక్, కె. నబి సాహెబ్ 6 మంది డ్రైవర్లు ఇవాళ రిటైర్డ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, గ్యారేజీ సిబ్బంది, రిటైర్డ్ అయిన వారి బంధుమిత్రులు, పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

About Author