NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమంగా పైపులైన్ వేసుకున్న వారిపై చర్యలు తీసుకోరా ?

1 min read

తహసిల్దార్ కి ఫిర్యాదు చేసిన జరగని న్యాయం

ఓబీసీ మోర్చా  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు :

కెసి. మద్దిలేటి ప్యాపిలి మండల బిజెపి అధ్యక్షులు :

కెబి. దామోదర్ నాయుడు

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని జల్దుర్గం పంచాయతీ కి సంబంధించిన గొల్లపల్లి బుగ్గ శివాలయం ఆవరణలో తెలుగుదేశం పార్టీకి చెందిన మహేష్ కన్నా అనే నాయకుడు దౌర్జన్యంగా బోరు వేసి అక్కడినుండి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని తన ఫ్యాక్టరీకి పైపులైన్ వేసుకోవడం దుర్మార్గమైన చర్యని బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు కేసీ మద్దిలేటి, ప్యాపిలి మండల బిజెపి అధ్యక్షులు కేబి దామోదర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి నాయకుడు మహేష్ కన్నా వేసుకున్న అక్రమ పైప్ లైన్ పై చర్యలు తీసుకోవాలని తాహసిల్దార్ భారతి కి వినతి పత్రం  సమర్పించినా  ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సేవకులైన ఉద్యోగులు ఇలా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని వ్యంగస్త్రాలు సంధించారు.  దేవస్థానం నుండి అక్రమంగా వేసుకున్న పైపు లైన్ పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

About Author