NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పథాలజీ విభాగాన్ని పలిశీలించిన మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్

1 min read

డా. కె. చిట్టి నరసమ్మ

కర్నూలు, న్యూస్​ నేడు:  ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రో బయాలజీ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజి యందు త్వరలో 7 వ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె . చిట్టి నర్సమ్మ సోమవారం కాలేజీ యందలి పథాలజీ విభాగాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సదస్సుకు వివిధ ప్రాంతాలలో నుండి ప్రముఖ వైద్యులు ఈ సదస్సులో పాల్గొంటారని కావున పథాలజి విభాగం యందు వాల్ పెయింటింగ్ అదేవిధంగా కావలసిన ఏర్పాట్ల గురించి పథాలజీ విభాగాధిపతి   డా. బాలేశ్వరి ప్రిన్సిపాల్ కు వివరించడం జరిగింది. ప్రిన్సిపాల్ వెంట ప్రొఫెసర్ హేమలత, అసోసియేట్ ప్రొఫెసర్ డా.రేవతి,డా.సునీత అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.షహనాజ్, డాక్టర్ విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

About Author