ఏ ఎస్ ఐ అరుణాచలం సేవలు మరువలేనివి- సీఐ కృష్ణారెడ్డి
1 min read

న్యూస్ నేడు చెన్నూరు : ఏఎస్ఐ అరుణాచలం విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన విధి నిర్వహణలో భాగంగా ఇక్కడికి వచ్చిన తక్కువ కాలంలోనే తమ తోటి అందరి సిబ్బందితో సఖ్యతగా , స్నేహపూర్వకంగా మెలుగుతూ అందరి మన్ననలు పొందారని అలాంటి మంచి మనిషి నేడు పదవి విరమణ పొందడం జరిగిందని సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం తమ సిబ్బందితో పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ అరుణాచలంను ఘనంగా సత్కరించి ఆయనను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏఎస్ఐ అరుణాచలం ముఖ స్వభావి అని అందరితో కలిసిమెలిసి విధి నిర్వహణలో ని తమ బాధ్యతలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్ లో ఆయన విధులు నిర్వహించిన అక్కడి సిబ్బందితో స్నేహపూర్వకంగా వ్యవహరించే వ్యక్తని అలాంటి మంచి మనసు గల వ్యక్తి అరుణాచలం అని ఆయన కొనియాడారు. నేడు పదవి విరమణ పొందిన ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి తమ కుటుంబ సభ్యులతో చక్కగా కలిసిమెలిసి జీవించాలని ఆయన కోరారు. ఏఎస్ఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది మాట్లాడుతూ, చెన్నూరు పోలీస్ స్టేషన్ కు ఈ మధ్య కాలంలోనే బదిలీపై వచ్చిన అరుణాచలం మంచి మనసున్న వ్యక్తని ఆయన అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని అయితే వచ్చిన కొద్ది రోజులలోనే ఆయనకు ఇక్కడే పదవి విరమణ రావడం జరిగిందని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నామని, కుటుంబ సభ్యులతో ఆయన ఈ పదవి విరమణ సందర్భంగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నామని తెలియజేస్తూ, ఆయనను ఘనంగా శాలువాలతో పూల మాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్ళు శ్రీరాములు, సుబ్బయ్య, సుబ్బరాజు, పుష్పరాజు, శివారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

