చింతలపూడిలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం
1 min read

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు
రాబోయే పథకాలకు నాయకులు భరోసా కల్పించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :చింతలపూడి నియోజకవర్గంచింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతలపూడి పట్టణంలో “సూపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో భాగంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించచారు. అనంతరం స్థానిక వెలమపేటలో డోర్ టూ డోర్ వెళ్లి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమం గురించి ప్రజలకు వివరించి భవిష్యత్తు లో ప్రభుత్వం నుండి రాబోయే పధకాలు గురించి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే రోషన్ ద్వారా వాటిని పరిష్కరిస్తామని నాయకులు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు తాటి అప్పారావు, ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం,మాజీ సర్పంచ్ చిట్లూరి ధర్మరాజు,ఐటీడీపి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు,తిరుమిల్లి ఎస్ సి మన్యం సత్య కుమార్,కంభం రమేష్, నత్తా రవి, మద్దా ఆనంద్ కుమార్,చిట్లూరి రాజా,పూడి సుబ్బారావు, వేములపల్లి సూరిబాబు,బూసి రమేష్,జైపాల్,హెచ్చు యోహాను, బూడి రమణ, బాణావత్ ప్రభాకర్,డాన్,షేక్ సుభాని, కొనకళ్ళ సతీష్, చవ్వ శ్రీను, బోడ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

