NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

50వ డివిజన్ లో సుపరిపాలనలో తొలగడుగు కార్యక్రమం విజయవంతం

1 min read

క్షేత్రస్థాయిలో సూపర్ సెక్స్ పథకాలపై ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చంటి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పరిశీలన

డివిజన్ ప్రజల నుంచి మంచి స్పందన

పెద్ద ఎత్తున పాల్గొన్న డివిజన్ ప్రజలు,కుటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు.”సుపరిపాలనలో తొలిఅడుగు” కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు బుధవారం ఏలూరు నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,50వ డివిజన్ నుండి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య , ఎంపీ పుట్టా మహేష్ కుమార్,ఆప్కాబ్ చైర్మన్ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు హాజరయ్యారు.ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో సూపర్  సిక్స్ హామీల్లో గ్యాస్ సిలిండర్లు అందుతున్నవి లేనివి, ప్రతి ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ తల్లికి వందనం ద్వారా 15 వేల రూపాయలు తల్లుల ఖాతాలో జమ అయినవి లేనివి,పింఛన్లు అర్హులందరికీ అందుతున్నది లేనివి క్షేత్రస్థాయిలో అడిగి అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గం అభివృద్ధి విషయంలో,డివిజన్లో జరిగిన అభివృద్ధి పనులు పై ప్రజల నుండి మంచి స్పందన తో విజయవంతమైంది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు,ఈడ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి. ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, సంబంధిత శాఖల అధికారులు మరియు డివిజన్ ఇంచార్జ్ నాయుడు,క్లస్టర్ ఇన్చార్జులు డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author