దళిత నేత జుజ్జువరపు జయరాజు 5వ వర్ధంతి
1 min read

రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన దళిత సేన అధ్యక్షులు జుజ్జువరపు రవి
ఆయన సేవలను కొనియాడిన సంఘం నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :దళిత నేత స్వర్గీయ జిజ్జువరపు జయరాజు 5వ వర్ధంతి సందర్భంగా దళిత సేన రాష్ట్ర కార్యాలయం ఏలూరులో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు మైనార్టీలకు ఆయన చేసిన సేవలను కొనియాడుతూ గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో దళిత సేనవ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ ,పశ్చిమగోదావరి జిల్లా దళిత సేన అధ్యక్షులు చీలి మోహనరావు, నల్లజర్ల మండల దళిత సేన అధ్యక్షులు దొండపాటి సువర్ణ రాజు, పెంటపాడు మండల దళిత సేన అధ్యక్షులు శ్రీనివాసరావు, తదితర దళిత నాయకులు ఘన నివాళి అర్పించారు.

