సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని కొండపేట 10వ వార్డు నందు డోన్ కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మరియు నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద నిర్వహించిన డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం సందర్భంగా, ఎమ్మెల్యే ప్రజలతో వారి అభిప్రాయాలు తెలుసుకొని మరియు వారితో మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా — ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించి,ఇది ప్రజా ప్రభుత్వం..ప్రజల వద్దకు పాలన కాదు, ప్రజల మధ్యే పాలన..ఇంటింటికీ సుపరిపాలన అందిస్తున్నాం.. చేసింది ధైర్యంగా ప్రజలకు చెప్తున్నాం..అని ఎమ్మెల్యే తెలిపారు.ఈకార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వై.నాగేశ్వరావు యాదవ్ , సీనియర్ తెదేపా నాయకులు కేశన్న గౌడ్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


