వరినట్లు నాటిన ఆలూరు ఎమ్మెల్యే….
1 min read

న్యూస్ నేడు హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం హెబ్బటం మరియు హొళగుంద రోడ్డు మధ్యలో వరినట్లు నాటిన ఆలూరు_ఎమ్మెల్యే_ బుసినే_విరుపాక్షి_ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ. ఢణపురం టూ హొళగుంద రోడ్డు దాదాపుగా 30 కిలోమీటర్ అద్వానంగా ఉంది. వైస్సార్సీపీ పార్టీ అధికారంలో ఉన్నపుడు టెండర్లను వేశారు, కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ టెండర్ల ను రద్దు చేశారు. హొళగుంద నుండి ధనాపురం వెళ్లాలంటే ప్రజలు రోడ్డు బాగాలేనందున ప్రయాణం చేయాలన నరాక యాతన అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో గుంతలు లేని రోడ్డు ఉండాలన్నారు, కానీ వారు మాటలు తప్ప పనిచేయటం లేదు అని అన్నారు మా జగనన్న చెప్పినట్టుగా చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ విధంగా హొళగుంద టు ధనాపురం రోడ్డులో టెండర్లను రద్దు చేశారు. రోడ్డు బాగా లేనందున బస్ డిపో మేనేజర్ కొన్ని బస్సులను రద్దు చేశారు, కానీ డిపో మేనేజర్ కి ఫోన్లో మాట్లాడి బస్సు లను అలాగే కొనసాగించాలని చెప్పాను.పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కదా మీరు అప్పుడేమో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఏమో పట్టించుకోవడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ మీరు సినిమాలు తీసేదకి తప్ప రాజకీయాలు పనికిరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇప్పటివరకు 161000 కోట్లు అప్పు చేశారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అన్నారు.రాజధాని అమరావతి అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. వెంటనే హొళగుంద నుండి ఢణపురం రోడ్డు టెండర్లను పిలిచి రోడ్డు వెయ్యాలన్నారు. ఆదోని శాసనసభ్యులు పార్థసారధి మీ పరిధిలోకి కూడా 10 km రోడ్డు వస్తుంది మీరు కూడా పట్టించుకోవడం లేదన్నారు.పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మీ పార్టీ ఆఫీసును చుట్టూ ముడుతామని హెచ్చరించారు.ఈకార్యక్రమం వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, వైఎస్ఆర్సిపి మండల షఫీ ఉల్లా, సర్పంచ్ తనయుడు పంప, శేషప్ప, వైస్ ఎంపీపీ అనుమప్ప, మల్లి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

