చంద్రబాబు ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చలేదు.. ఎమ్మెల్యే
1 min read

న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండల కేంద్రం నందు క్షేత్రగుడి ఆంజనేయ స్వామి కళ్యాణ మండలంలోపార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న.ఆలూరు_ ఎమ్మెల్యే _బుసినే_విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చంద్రబాబు నాయుడు మీకు ఎంత అప్పు ఉన్నారో చూడవచ్చు అన్నారు, చంద్రబాబు నాయుడు ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు, మన జగనన్న రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నాయకుని కార్యకర్తని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారన్నారు, అలాగే నేను కూడా నాయకులకు కార్యకర్తలకు పూర్తిగా ఎవరు ఊరు వాళ్ళకె వర్క్స్ ఇస్తామన్నారు, మీరు మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమలను కస్టపడి చేయాలన్నారు, అలాగే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరు కష్టపడి పనిచేయాలన్నారు.ఈకార్యక్రమం వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.



