NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వం యూనివర్సిటీ పై కపట ప్రేమ మానుకోవాలి

1 min read

యూనివర్సిటీ విద్యార్థులకు  కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ పర్మిషన్ ఇప్పించాలి

 వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి డిమాండ్

న్యూస్ నేడు ,చెన్నూరు : వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ యూనివర్సిటీ  పై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ మానుకోవాలని వైఎస్ఆర్సిపి కమలాపురం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పరిధిలో గల వైయస్సార్ ఆర్కిటెక్ యూనివర్సిటీని ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, వైయస్సార్ ఆర్కిటెక్ యూనివర్సిటీలో 500 మంది విద్యార్థులతో 13 డిపార్ట్మెంట్ లతో  ఉన్నదని  అయితే ఆర్కిటెక్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినదని విద్యార్థుల జీవితాలతో  ఆటలాడొద్దని ఆయనక హితవు పలికారు.   2020, 21, 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన సి ఓ ఏ కౌన్సిల్ అఫ్ ఆర్కిటెక్ పరిమిషన్  ఇవ్వవలసి ఉందని, పది రోజుల్లో విద్యా సంవత్సరం పూర్తి అవుతున్న ఇంకా  పర్మిషన్ లేకపోవడం పై విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటే  యూనివర్సిటీ అధికారులు ,ఉన్నత అధికారులు అదిగో ఇదిగో అంటూ మోసం చేస్తూనే ఉన్నారని ఇది సరైన పద్ధతి కాదని అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. పైగా  ప్రభుత్వం యూనివర్సిటీ బిల్డింగులకు రెంటు కడుతుంటే వైస్ ఛాన్స్లర్  కాంట్రాక్టర్ కి మధ్య విభేదాల కారణంగా  విద్యార్థులను ఇబ్బంది పెడుతూ హాస్టల్ లేకుండా వికెట్ చేయమని ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా చేయడం దారుణమని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్క విద్యార్థితో కాషన్ డిపాజిట్ కింద 12 వేల రూపాయలు కట్టించుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విధంగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఇక్కడ అధ్యాపకులు  కూడా మే నెల 21 వచ్చేది వరకు వారి బోధిత సమయం పూర్తయి రెన్యువల్ లేని కారణంగా  అధ్యాపకులు బోధించకుండా ఉన్నారని తెలిపారు ఇలాంటి సందర్భంలో ఐదవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు  ప్రాక్టికల్ వర్క్, పరీక్షలకు ఎలా వెళ్తారని ఆయన అధికారులన్నీ ప్రశ్నించారు, ఈ క్రమంలోనే ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను చెప్పి ఇంటికి పంపించడం జరిగిందన్నారు, మరి కొంతమంది విద్యార్థులను ఫీల్డ్ వర్క్ అని పంపించేశారని ఉన్న విద్యార్థులకు బోధనను బోధించకుండా వ్యవహరిస్తున్నారని ఆయన తెలియజేశారు, పైగా ఆర్ట్ అండ్ డిజైన్ ( ఏడి )  ఏప్రిల్ లో ఇవ్వవలసిన సెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారని,  వైయస్సార్ ఆర్కిటెక్ యూనివర్సిటీ పై అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని లోతుగా సమగ్ర విచారణ చేపట్టాలని, ఈ విషయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని లేకపోతే పెద్ద ఎత్తున  విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల రైతు సంఘం ఉపాధ్యక్షులు, రెడ్డి శేఖర్ రెడ్డి , వైఎస్ఆర్సిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author