NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి వేడుకలు

1 min read

జిల్లా పోలీస్ కార్యాలయంలో నివాళులర్పించిన జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్

మన జిల్లాలతో అల్లూరికి అభినవభవ సంబంధాలు ఉన్నాయి

అదనపు ఎస్పి మరియు పోలీస్ ఉన్నతాధికారులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ని పురస్కరించుకొని శుక్రవారం నాడు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘనముగా నివాళులు అర్పించినారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కి పశ్చిమగోదావరి జిల్లాతో అభినవభావ సంబంధాలు ఉన్నట్లు అల్లూరు సీతారామరాజు ఇప్పటి పాలకోడేరు మండలం మోగల్ల గ్రామంలో వారి యొక్క మేనమామ ఇంటి వద్ద పుట్టి పెరిగినట్టు, బాల్య విద్యాభ్యాసాల అనంతరం చింతపల్లి పాడేరు రంపచోడవరం ప్రాంతాలలో అప్పటి బ్రిటిష్ పాలకుల నిరంకుశ ధోరణితో బ్రిటిష్ పాలకుల అకృత్యాలకు ఎదురు నిలిచి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన మహనీయుడు అని ఆయన స్వాతంత్ర ఉద్యమ విప్లవ కారణంగా పేరొందిన మహావీరుడని ఆయన యొక్క సేవలు నేటి తరం యువత అనుభవానికి ఎంతో దోహదపడుతుందని, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అదనపు ఎస్పీ అడ్మిన్ కొనియాడినారు. ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్పి ప్రసాద్ రావు,ఏ ఆర్ డి ఎస్ పి చంద్రశేఖర్,ఎస్ ఐ డి సి ఆర్ బి, రాజా రెడ్డి, ఆర్ఎస్ఐ భాస్కరరావు,పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ ప్రధాన కార్యాలయం  మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author