నియోజకవర్గాల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి
1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలో పొద్దు పరిచయం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాలో వృద్ధిరేటు లక్ష్యాల సాధన దిశగా నియోజకవర్గాల అభివృద్ధిపై నిబంధనలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. . స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం అధికారులు, నియోజకవర్గాల అభివృద్ధి విజన్ ప్లాన్ రూపొందించే సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్-2047 యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లా,నియోజకవర్గాల విజన్ డాక్యూమెంట్లు రూపొందించడం జరిగిందని, జిల్లాలో విస్తృతంగా లభిస్తున్న వనరులు,ఆహార,ఉద్యానవన రంగాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అనుకూల పరిస్థితులు,తదితర అంశాలను ప్రణాళికలో పొందిపరచడం జరిగిందన్నారు.జిల్లాలో, నియోజకవర్గాల స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.యూనిట్ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే తో పాటు, జిల్లా స్థాయి అధికారి నోడల్ అధికారిగా ఉంటారని, విద్యావేత్త, సంబంధిత టీం సభ్యులు 5గురు సిబ్బంది ఉంటారన్నారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగ అవకాశాలుతోపాటు 15 శాతం వృద్ధిరేటు సాధించే దిశగా నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలతో నియోజకవర్గ అభివృద్ధికి విజన్ ప్లాన్ అమలు చేయడంలో నియోజకవర్గ యూనిట్ కార్యాలయం సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశంలో సిపిఒ వాసుదేవరావు,డిఆర్డిఏ పీడీ విజయరాజు, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ పంకజ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జెడి గోవిందరాజులు, ఉద్యానవనాలు శాఖ డిడి రామ్మోహన్,మత్య్స శాఖ జెడి నాగలింగాచార్యులు,వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ యూనిట్ కార్యాలయాల సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.

