సిపిఐ ఏలూరు జిల్లా 2వ మహాసభలు జయప్రదం చేయండి
1 min read

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి సమావేశం బళ్ల కనకదుర్గారావు అధ్యక్షతన ఆర్.ఆర్.పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది.ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్ళ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో సంస్థాగతమైన మహాసభలు నిర్వహించుకోవడం ఆనందదాయకమని అన్నారు. రేపటి నుంచి మూడు రోజులు పాటు చింతలపూడి మండలంలో జరిగే ఏలూరు జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమ శంకర్ సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ అడ్డగర్ల లక్ష్మీ ఇందిరాలు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు జిల్లా రెండో మహాసభలు జయప్రదానికి ఏలూరు నుండి అధిక సంఖ్యలో పార్టీ సభ్యులు, సానుభూతిపరులు,కార్మిక సంఘాలు,ప్రజా సంఘాల నాయకులు తరలి రావాలని చింతలపూడిలో జరిగే ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కొల్లూరి సుధారాణి,గొర్లి స్వాతి, ఎంఏ హకీం,కొండేటి రాంబాబు,కొంపల్లి కృష్ణమాచార్యులు,కాటూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


