కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం
1 min read

హొళగుంద , న్యూస్ నేడు: కార్మిక సంఘాలుహొళగుంద మండలంలో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాలు భారీ ర్యాలీ స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి వాల్మీకిసర్కిల్ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్ళడం జరిగింది, ఏ ఉద్యోగ కార్మికుల ర్యాలీ సభను ఉద్దేశించి రైతు సంఘం మండల కార్యదర్శులు వెంకటేష్ మరెప్ప ఐఎఫ్టియు జిల్లా నాయకులు రామంజినేయు సవరప్ప సీఐటీయూ ఏఐటీయూసీ మండల కార్యదర్శి నాగరాజు రంగన్న , ఐఎఫ్టియు వీఆర్ఏ, అంగన్వాడీ,ఆశావర్కర్ యూనియన్ నాయకులు మునిస్వామి మల్లయ్య మహాలక్ష్మి సలోమీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాలు కావస్తున్న మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ లేబర్ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ లాగా మార్చిందని దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు, గతంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 8 విధానాన్ని రద్దుచేసి 10 గంటల పని విధానానికి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కోలుకుంటున్నాయని వీటిని కార్మిక ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అలాగే స్కీం వర్కర్లైన అంగన్వాడీ ఆశ ,కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అప్పటివరకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి బ్యాంకింగ్ రైల్వే తదితర సంస్థలను ప్రవేట్ వారి నుండి ప్రజా సంస్థలను కాపాడాలని అన్నారు, ఆటో భవనం తదితర రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు, ఈరోజు జరుగు దేశ వ్యాప్తంగా ఉద్యోగ కార్మికుల సమ్మె పాల్గొని హక్కులను రక్షించుకోవాలని, ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని కోరారు ఈ కార్యక్రమంలో రవి రైతు సంఘం వీఆర్ఏ అంగన్వాడి ఆశ ఆటో యూనియన్ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.


