600 బ్యాగుల యూరియా ఎరువును పంపిణీ
1 min read

హోళగుంద, న్యూస్ నేడు: హొళగుంద మండల పరిధిలోని రైతులకు మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక దళ్ వారి ఆధ్వర్యంలో 600 బ్యాగుల యూరియా ఎరువును పంపిణీ చేయడం జరిగింది అలాగే మండల పరిధిలోని అన్ని ఆర్ఎస్కే లో యూరియాకు సంబంధించి378mts ఇండెంట్ పెట్టడం జరిగింది రాబోయే రెండు రోజుల్లోహొళగుంద కు యూరియా రావడం జరుగుతుంది కావున రైతులు ఎవరు కూడా ఆందోళన చేసే అవసరం లేదు రైతులు యూరియాను అవసరానికి మించి వాడడం వల్ల నెల నిస్సరావడమే కాకుండా సాగు ఖర్చు పెరిగి రసం పేల్చి పురుగుల ఉత్పత్తి పెరుగుతుంది కావున రైతులు పత్తి వేరుశనగ పంటల్లో మూడు దాఫాలుగా మాత్రము అనగా విత్తనం వేసేటప్పుడు, నెలరోజులప్పుడు 60 రోజుల దశలో పై పాటుగా యూరియాను చల్లుకోవాలి నత్రాజని, బాస్వరం, పొటాష్, ఎరువుల సమతుల్యత పాటించినప్పుడే మంచి దిగుబడ లు వస్తాయి పంటల్లో రోగ నిరోధక శక్తి పెరగడానికి 60 రోజుల దశలో పటాస్ ఎరువును తప్పక వాడాలి ఈ కార్యక్రమంలో ఏఈఓ విరుపాక్షి, ఏఈఓ ఎస్ మాన్యశ్రీ, రామ నాయక్ భారతి భాయ్ ఎంపీఈఓ నరసింహ పాల్గొన్నారు.

