NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిలీనియం చర్చి ఉత్సవాలు ప్రారంభం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూల్ నగరంలో ఉద్యోగ నగర్ లో ఉన్న మిలీనియం చర్చి నందు మంగళవారం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. సిల్వర్ జూబ్లీ ప్రారంభోత్సవ ఉత్సవ సందర్భంలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా దైవ సేవకుల తో ప్రార్థన సదస్సును ప్రారంభించారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ సంఘం కాపరులు దైవ సేవకులు 500 మందితో ఈ ప్రార్థనా సదస్సును హాజరైనారు  మిలీనియం బాప్టిస్ట్ చర్చి 24 వసంతాలు పూర్తిచేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వచ్చే సంవత్సరo జూన్ 30వ తేదీ వరకు ఈ సిల్వర్ సిల్వర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని మిలీనియం బాప్టిస్ట్ సంఘ ఫౌండర్ సంఘ కాపరి కేజే విజయ్ కుమార్ అన్నారు.  మిలీనియం సంఘము ఉద్యోగ నగర్ లో 24 సంవత్సరాల క్రితం స్థాపించబడిందని షరీఫ్ నగర్ ఉద్యోగ నగర్ ముజఫర్ నగర్ నందు నివసిస్తున్న క్రైస్తవ కుటుంబాలను దైవ మార్గంలో నడిపించే దిశగా కృషి చేస్తున్నానని 40 సంవత్సరముల నుండి దైవ సేవకే అంకితం అయ్యా అని దైవ మార్గము దైవ సందేశం ప్రతి ఇంటికి చేరవేయాలని ఉద్దేశ్యంతో 24 సంవత్సరాల క్రితం ఈ మిలీనియం బాప్టిస్ట్ చర్చి స్థాపించబడినదని అప్పటినుండి ఇప్పటివరకు సంఘ పరిచర్య చేస్తూ ఉన్నామని ఈ సంఘ పరిచర్యలో భాగంగా ఇప్పటివరకు మిలీనియం బాప్టిస్ట్ సంఘం తరఫున ఐదు అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసి దైవ సేవ చేస్తున్నామని ఈ సేవలో భాగంగా బైబిల్ కళాశాల ను ఏర్పాటు చేసి 1050 మంది వరకు శిక్షణ ఇచ్చి దైవ సేవకులుగా తీర్చిదిద్దడం జరిగిందని 40 సంవత్సరముల నుండి సువార్త సేవను ప్రకటిస్తున్నానని కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతిపల్లె కు సువార్తను చేరవేశానని అనంతపురం జిల్లాలో కూడా సువార్త ప్రకటిస్తున్నామని మూడు సంవత్సరముల క్రిందట మిలీనియం ట్రస్ట్ ను ప్రారంభించామని ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు, రోగులకు, వృద్ధులకు అనాధ బాల బాలికలకు మా వంతుగా సేవలు చేస్తున్నామని తన దైవ సేవకు గుర్తించి 2014లో ప్రభుత్వము సేవ విభూషణ్ అనే బిరుదును ఇచ్చినారు అలాగే బైబిల్ టీవీ వారు క్రీస్తు రత్నాలు బిరుదును ఇండిపెండెంట్ బిషప్ స్ కౌన్సిల్ వారు క్రైస్తవ విశిష్ట రత్న అనే బిరుదును ఇచ్చారు అని అన్నారు ఈ రజితోత్సవమును ముఖ్య అతిథిగా విచ్చేసిన ది మోస్ట్ రైట్ రెవరెండ్ డా. జోహానస్ గోరంట్ల  ఓ ఎస్ డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో ప్రారంభించారు అనంతరం దైవ సందేశం అందించారు ఈ కార్యక్రమము మిలీనియం బాప్టిస్ట్ సంఘము సంఘ కుటుంబంలు స్త్రీల సమాజం, సంఘ పెద్దలు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

About Author