కళ్యాణ వైభోగమే…
1 min read

25 నుంచి పెళ్లిళ్ల సందడి..
- లక్షల మందికి ఉపాధి..
- కళకళలాడుతున్న బంగారు, బట్టల దుకాణాలు
- శుభ ముహుర్తాలు వెల్లడించిన ఆమంచి విశ్వేశ్వర శర్మ, పురోహితుడు, కర్నూలు
కర్నూలు, న్యూస్ నేడు :పెళ్లిల ముహుర్తాల కోసం ఎదురు చూస్తున్న ఎందరికో … శ్రావణమాసం శుభ ముహుర్తాలు తీసుకొచ్చినట్లయిం దన్నారు ప్రముఖ పురోహితుడు ఆమంచి విశ్వేశ్వర శర్మ. పెళ్లి అంటే… ఇద్దరి వ్యక్తులను కలిపేది కాదని… ఇద్దరిని ఒకటి చేసేదన్నారు. అంతేకాక వేల మందికి జీవనోపాధి లభించేలా చేసేదే పెళ్లి అని.. అటువంటి పెళ్లి సందడి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి పరిణామమేనన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 50 రోజుల క్రితం నిలబడిపోయిన వివాహాలు ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతున్నందున భాజా భజంత్రీలు మోగనున్నాయి. కొత్తగా స్కూళ్లు తెరవడం, ఆషాఢ మాసం రెండూ వెంట వెంటనే అయిపోవస్తుండటం వల్ల ఇక అందరూ పెళ్లిళ్ల సందడిలో మునిగి తేలుతున్నారు. శ్రావణ మాసంలో వచ్చే మహుర్తాలు దాదాపు పది వరకు ఉన్నాయి. అందు వల్ల రెండు మూడు నెలల క్రితమే కళ్యాణ మండపాలు, భజంత్రీలు వంటవాళ్లను ఎప్పోడో మాట్లాడి పెట్టుకున్నారు. సమయమాణిక్యంగా బంగారు అందని ఎత్తుకు ఎదిగిపోయినా.. బీదాలేదు.. సాదా లేదు. అందరూ కొనుక్కోవాల్సిన మొదటి వస్తువు బంగారే . కాబట్టి బంగారు దుకాణాలు, బట్టల అంగళ్లు కళకళ లాడుతున్నాయి. పురోహితులంతా కూడా పెళ్లిళ్లల కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఒక్క వివాహం ఆగిపోయిందంటే మార్కెట్ లో 18 రకాల వారికి వ్యాపారాలు కుంటుబడతాయి. అందుకే ఒక పెళ్లి జరుగుతుందంటే కొన్ని వందల మందికి జీవనోపాధి కలగడమే కాకుండా బంధు జనులందరికీ విందు భోజనం ఏర్పాటు చేయకతప్పదు. ఎక్కువగా భజంత్రీలు, వంటకాలన్నీ ముహుర్తాలు ఎప్పుడెప్పుడా అని ఎక్కువగా ఎదురు చూస్తుంటారు.
శుభ ముహూర్తాలు ఇవి…
జూలై నెలలో 27,30,31,
ఆగస్టు 3,6,8,9,10,13,14,17
అక్టోబరు 4,5,8,11,12, 17,24,26,31
నవంబరు 1,5,7,8,13,15,16,23,26,27,30,
డిసెంబరు 5
ఫిబ్రవరి 8,11,13,20,21,22,25,26
మార్చి 4,5,6,7,8,12,14,15

