యూపీహెచ్సీ లో చిన్న పిల్లల వైద్యులను నియమించండి
1 min read
డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు యం.మద్దులేటి
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు :కర్నూలు మున్సిపల్ స్టాంటన్ పురం లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చిన్న పిల్లల వైద్యులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వైద్యులను నియమించాలని డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు యం.మద్దులేటి ఉన్నతాధికారులను కోరారు. బుధవారం ఆయన స్టాంటన్ పురంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించారు. యూపీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, మందులు, ల్యాబ్ తదితర అంశాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సిబ్బందితో కూడా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటరులో నెలకొన్న సమస్యలపై కె.డి.సి.సి.బ్యాంక్ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి , కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి దృష్టికి తీసుకెళ్తానని, ఆ తరువాత వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి , కలెక్టర్ రంజిత్ బాషా దృష్టి కి తీసుకుపోయి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

