NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తే రైతే రాజు

1 min read

మహానంది, న్యూస్​ నేడు:   ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే రైతే రాజు అని నంద్యాల రూరల్ ఏ డి ఏ చెన్నయ్య పేర్కొన్నారు. మండలంలోని బొల్లవరం గ్రామంలో జరిగిన రైతు శిక్షణ కార్యక్రమం ను వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించాలన్నారు. దానివల్ల భూసారం పెరగడంతో పాటు వాతావరణ కాలుష్యం తగ్గుతుంది అన్నారు. రైతులు తమ పంట పొలాల్లో పిచికారి చేసే వివిధ రకాల క్రిమిసంహారక, తెగుళ్ల నివారణ మందులు పరిమితంగా వాడాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు వాడాలన్నారు. ప్రైవేట్ వ్యాపారులు  యూరియాతోపాటు నానో యూరియా మరియు డిఏపి అంటగట్టడంతోపాటు దుబ్బు కట్టే గుళికలను కూడా అంటగడుతున్నారని రైతులు పేర్కొన్నారు. దీనికి ఏ డి ఏ స్పందిస్తూ నానో యూరియా మరియు డిఏపి వాడకం వల్ల రైతులకు ఎలాంటి నష్టం లేదని వాటిని పిచికారి సమయంలో వినియోగించుకోవచ్చని తెలిపారు. కానీ వ్యాపారులు దుబ్బు కట్టే గుళికలను, ఇతరములు ఏవైనా రైతులకు అంటగట్టాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏ డి ఏ చెన్నయ్య వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు పంట పొలాల్లో ఏమైనా సమస్యలు ఉంటే నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంతో పాటు ఏడీఏ కార్యాలయాన్ని కూడా సంప్రదిస్తే పరిష్కార మార్గాలు చూపుతామన్నారు. రైతులు యూరియా కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారని అలాంటి అపోహలు పెట్టుకోవద్దు అన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు సకాలంలో సొసైటీల ద్వారా ప్రస్తుతం అందజేస్తామని కొద్దిరోజుల అనంతరం గ్రామాల్లో ఉన్న రైతు సేవ కేంద్రం ద్వారా కూడా రసాయనిక ఎరువులు అందజేస్తామని దీనికి సాంకేతిక కారణాలవల్ల కొంత సమయం పడుతుందన్నారు. యూరియా, పొటాష్, ఇతర రకాల రసాయనిక ఎరువులు వివిధ రూపాల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వాటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. (20. 20. 0 .13) భాస్వరం వాడకం తగ్గించి సింగిల్ సూపర్ ఫాస్పేట్( యస్ .యస్. పి) తక్కువ ధరకే లభిస్తుందని అవసరం అయితే దీనిని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతుల ముఖ్యంగా వరి కాకుండా మెట్ట పంటలు వేసుకోవడం వల్ల సాగునీరు ఆదా కావడంతో పాటు పెట్టుబడులు తగ్గి లాభాలు పొందే అవకాశం ఉందని కాబట్టి రైతులు మెట్ట పంటలపై దృష్టి సారించాలని ఏడిఎ కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి, జెడిఎ కార్యాలయ అధికారి ఉమ గ్రామ వ్యవసాయ శాఖ  అధికారిని మంజుల వీఆర్వో మాధవరావు, పంచాయతీ కార్యదర్శి నాగరత్న గ్రామ నాయకులు కిలారి వెంకటేశ్వర్లు, ఎర్రం శెట్టి నాగిశెట్టి గ్రామ రైతులు పాల్గొన్నారు.

About Author