NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విమానాశ్రయంలో సీఎం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..ఎస్పీ

1 min read

-పకడ్బందీగా ఏర్పాట్లు

ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్​ నేడు : ఈరోజు (17వ తేదీ గురువారం)నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో హంద్రీనీవా (హెచ్ ఎన్ఎస్ఎస్)కాలువకు నీళ్లు విడుదల చేయుటకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓర్వకల్లు విమానాశ్రయానికి వస్తున్న సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాట్లను బుధవారం కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష,ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ భధ్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.ఈ సంధర్బంగా పోలీసు బందోబస్తు,తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.ప్రోటో కాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎస్పీ ఆదేశించారు.విమానాశ్రయం  ప్రవేశ,నిష్క్రమణల దగ్గర బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం డైరెక్టర్ విద్యా సాగర్,కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్,కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్,భాస్కర్ రావు,  స్పెషల్ బ్రాంచ్ సీఐ తేజమూర్తి, కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు,   సీఐలు మహేశ్వర రెడ్డి,యశ్వంత్,ఓర్వకల్లు ఎస్సై సునీల్ కుమార్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author