అత్యాచార బాలిక కుటుంబానికి అండగా ఉంటాం
1 min read

వైఎస్ఆర్ సిపి ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్
వైఎస్ ఆర్ సిపి పార్టీ అండగా ఉంటుందని భరోసా
పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు నగరంలో పదేళ్ల బాలికపై మానవ మృగం అత్యాచారనికి పాల్పడటంపై వైయస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయ ప్రకాష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా జరుగుతున్నఆఘయిత్యాలకు పాల్పడటం హేయమైన చర్య. అలాంటి వారికి కఠిన శిక్షలు పడేలా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఏలూరులో బాలిక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ తూమరాడ స్రవంతి, జిల్లా కార్యదర్శి తులసి, పార్వతి, కొత్తపల్లి రాణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూక పెయ్యి సుధీర్ బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నేరుసు చిరంజీవి, నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, వాణిద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట మోహన్ రావు (జిఎంఆర్), ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్, రాష్ట్ర నూరు భాషా ముస్లిం సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి డాక్టర్:షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ) తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

