రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాసు తీరుపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు
1 min read

హొళగుంద ,న్యూస్ నేడు : మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటు, విద్యార్థుల తల్లిదండ్రులతో దురుసు ప్రవర్తన చేస్తూ దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి (డి వి ఈ ఓ) సురేష్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారులు విచారించారు.ఈ సందర్భంగా కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విచారణ నివేదికను జిల్లా ఉన్నత విద్యా అధికారులకు,ఆర్ జె డి అధికారులకు నివేదిక స్తామని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం అందేటట్లు చర్యలు తీసుకుంటామని అన్నారు.

