మధ్యవర్తిత్వం పై వన్ కే ర్యాలీ..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: సుప్రీం కోర్ట్ మధ్యవర్తిత్వ విభాగం సూచనల మేరకు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జి.కబర్థి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇంచార్జ్ కార్యదర్శి దివాకర్, మరియు కర్నూలు బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ హరినాథ్ చౌదరి బుధవారం మధ్యవర్తిత్వం పై వన్ కే ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కర్నూలు న్యాయ సేవా సదన్ జిల్లా కోర్ట్ ప్రాంగణం నుండి మున్సిఫ్ కోర్ట్ మీదుగా అంబెడ్కర్ సర్కిల్ నుండి కొండారెడ్డి బురుజు వరకు సాగింది. జిల్లా జడ్జి మాట్లాడుతు ప్రజలకు మీడియేషన్ వలన కలిగే లాభాలు అలాగే మీడియేషన్ ఉపయోగించి కేసులను త్వరగా ఎలా పరిష్కరించుతారో తెలియజేశారు. ఈ మీడియేషన్ ను ఉపయోగించుకుని ప్రజలు తమ కేసులను త్వరగా పరిష్కరించుకోవడానికి వీలవుతుందని తెలిపారు. ఈ ర్యాలీ లో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్,అదనపు జిల్లా జడ్జిలు,ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, బార్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, శిక్షణ పొందిన మీడియేషన్ న్యాయవాదులు నాగశేషయ్య, యూ. వి. లక్ష్మి, ఉమాదేవి, ఆశ బాయి మరియు న్యాయవాదులు, ట్రైని న్యాయవాదులు, ప్యారా లీగల్ వాలంటీర్స్ మరియు పోలీసులు పాల్గొన్నారు.

