ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో శిక్షణ
1 min read

మహానంది, న్యూస్ నేడు: ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మహానంది మండల తాసిల్దార్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం ఎలక్షన్ కమిషన్ సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రస్తుతం స్పెషల్ సమ్మరీ విజన్ కార్యక్రమ ప్రత్యేక సవరణలో భాగంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేయవలసి ఉందన్నారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా మార్పులు చేర్పులు చేయాలని బిఎల్ఓ లకు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు సంబంధించి ఓటర్ల జాబితాలో చేర్చే ముందు అన్నీ పరిశీలించాలన్నారు. చనిపోయిన వారివి ఇతర ప్రాంతాల్లో నివసించే వారిని తొలగించే సందర్భంలో వారి వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి తగు జాగ్రత్తలు తీసుకొని తొలగించాలన్నారు. ఓటర్ల జాబితా లో మార్పులు చేర్పులు చేసే సమయంలో నిష్పక్షపాతంగా బి ఎల్ వోలు వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సురేంద్ర నాథ్ రెడ్డి, మండల ఎలక్షన్ డీఈవో మణికంఠ ఆయా గ్రామాల వీఆర్వోలు, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

