గిరిజన ఆశ్రమం పాఠశాలను తనిఖీ చేసిన డి టి డబ్ల్యూ ఓ
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి (డి టి డబ్ల్యూ ఓ) గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారము మరియు భోజనం విద్యార్థులకు అందజేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్యం త్రాగునీరు తదితర అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్ఎం సత్యాలు ను ఆదేశించారు. పాఠశాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల బదిలీపై వచ్చిన కొందరు ఉపాధ్యాయుల విద్యాబోధన కు సంబంధించి తరగతి గదుల్లో బోధించే విధానాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం సత్యాలు మరియు ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు.

