NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బైరాపురం’లో సుపరిపాలనలో తొలి అడుగు..

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని బైరాపురం గ్రామంలో గ్రామ టీడీపీ నాయకులు మొల్ల చాకర్ వలి ఆధ్వర్యంలో ఆదివారం “సుపరిపాలనలో తొలి అడుగు”అనే కార్యక్రమం చేపట్టారు.కూటం ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన పథకాల గురించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ పథకాల గురించి వివరించారు. చెప్పిన మాట ప్రకారం చదువుతున్న పిల్లలందరికీ తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయని అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదును త్వరలోనే ప్రభుత్వం వేస్తుందని చాకర్ వలి ప్రజలతో అన్నారు.ఈ కార్యక్రమంలో మొల్లా షరీఫ్ భాష,కురువ రంగస్వామి, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

About Author