అంగరంగ వైభవంగా..సొసైటీ చైర్మన్ల ప్రమాణస్వీకారం
1 min read

పీరు సాహెబ్ పేట చైర్మన్ గా వెంకటేశ్వర్ రెడ్డినందికొట్కూరులో ముర్తు జావలి..
హాజరైన మాండ్ర శివానందరెడ్డి,గౌరు వెంకట రెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మరియు మిడుతూరులో జరిగిన సహకార సొసైటీ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం సాయంత్రం మిడుతూరు మండల కేంద్రంలో సహకార సొసైటీ ప్రాంగణంలో నూతన సొసైటీ చైర్మన్ గా చింతలపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.అదేవిధంగా నందికొట్కూరులో కేవిఆర్ గార్డెన్ లో నందికొట్కూరు సహకార సొసైటీ చైర్మన్ గా ఎస్ ముర్తు జావలి ప్రమాణస్వీకారం మాండ్రతో పాటు నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి హాజరయ్యారు.శివానందరెడ్డి కి నూతన చైర్మన్లు ఘన స్వాగతం పలికారు. నందికొట్కూరు పట్టణంలో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా శివానందరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారికే నామినేటెడ్ పదవులు రావడం గర్వించదగ్గ విషయమని పార్టీ కోసం కార్యకర్తల కోసం నూతన చైర్మన్లు చాలా కష్టపడ్డారని అందుకే పార్టీ గుర్తించి వారికి పదవులు కట్టబెట్టిందన్నారు. అంతేకాకుండా రైతులకు ఎరువులు విత్తనాలు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అందజేసే వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.టీడీపీ రైతులను ఎప్పటికీ మర్చిపోదని రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని శివానందరెడ్డి అన్నారు.తర్వాత నూతన చైర్మన్లను ఆయన అభినందించారు.మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు అదేవిధంగా నందికొట్కూరు పట్టణంలోని కార్యకర్తలు నూతన చైర్మన్లను పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్,దేవుళ్ళ మురళీ,ఖాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి,డీ సీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి,నాగేంద్ర,సంపంగి రవీంద్రబాబు, రమణారెడ్డి,ఎస్ఎండీ జమీల్, తదితరులు పాల్గొన్నారు.



