పేదప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం .బి.వీరభద్రగౌడ్
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బడుగు బలహీన వర్గాల పేదప్రజల ఆశాజ్యోతి వీరభద్రగౌడ్ ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను నియోజకవర్గ వివిధ మండ లాలకు చెందిన ఆయా గ్రామాల లబ్దిదారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో లబ్దిదారులు, ఆలూరు పట్టణ మరియు వివిధ మండలాలకు చెందిన ఆయా గ్రామాల టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు టిడిపి క్లస్టర్, యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు, తెలుగు యువత,ఐటిడిపి, టిఎన్ఎస్ఎఫ్, టిడిపి, సోషల్ మీడియా ప్రతినిధులు అందరూ పెద్దఎత్తున హాజరయ్యారు.

