NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే చొరవతో దక్షిణపువీధి స్మశానవాటిక రూపులేఖలు మార్పు

1 min read

మార్వాడి వ్యాపారస్తుల సహకారంతో పూర్వవైభవం

నగరంలో పలు సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఎమ్మెల్యే చొరవతో దక్షిణపు వీధి స్మశాన వాటిక రూపు రేఖలు మారాయని ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దక్షిణపు వీధి స్మశాన వాటికను గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు,చెత్త చెదారాలతో అధ్వానంగా తయారయింద నాని వాపోయారు. నగరంలో పలు సమస్యలపై దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రజా సమస్యల పరిష్కార దిశగా వెళుతున్న వెంకన్నచెరువు కంటపడగా స్మశాన వాటిక పరిస్థితి చూసి వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు. దీంతో మార్వాడి వ్యాపారస్తుల  సహకారంతో ఎమ్మెల్యే బడేటి చంటి దానికి పూర్వవైభవం తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే బడేటి చంటి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author