NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు మంచి సర్వీసులు అందించాలి…

1 min read

రీ-సర్వే పూర్తి అయిన గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను పిలిచి ఒక పండుగ కార్యక్రమం నిర్వహించి భావితరాలకు తెలిసేలా విజయగాథ పుస్తకాన్ని ప్రచురించాలి

జిల్లాలో ఇండ్లస్థలం కొరకు నిరుపేదలను గుర్తించి ఆగస్టు 15 వ తేదీ నాటికి జాబితాను సిద్ధం చెయ్యాలి

పిజిఆర్ యస్ కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని శాశ్వత పరిష్కారం చూపాలి

రాష్ట్ర భూపరిపాలన శాఖ అదనపు చీఫ్ కమీషనర్ మరియు సర్వే శాఖ డైరెక్టర్ యన్.ప్రభాకర్ రెడ్డి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం ” రెవిన్యూ అంశాలు  మరియు రీ-సర్వే లపై రాష్ట్ర భూపరిపాలన శాఖ అదనపు చీఫ్ కమీషనర్ మరియు సర్వే శాఖ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి సంయుక్తంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆగస్టు 15 వ తేదీనాటికి నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు సిద్ధం చెయ్యాలని,జీవోయంయస్ నెంబరు 30 ప్రకారం ఆక్రమణల రెగ్యులేషన్స్ , పిజిఆర్ యస్,రీ సర్వే,తదితర అంశాలపై మండలాలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రగతిలో వెనుక పడ్డ మండలాలు అధికారులు పట్ల అసహనం వ్యక్తం చేశారు. పిజిఆర్ యస్ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఆర్జీని శాశ్వత పరిష్కారం చూపాలని,అదే ఫిర్యాదు మరల వస్తే ఆ అధికారి వైఫల్యం చెందినట్లేనని అన్నారు. జిల్లాలో కొన్ని రీసర్వే పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించానని, కొన్ని తప్పులు గమనించి మొదటి తప్పుగా హెచ్చరికతో సరిపెట్టానని అన్నారు.మరల జిల్లా పర్యటనకు వచ్చి నప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని ఇదే సంఘటనలు పునారావతం అయితే సంబంధిత అధికారులను,సిబ్బందిని బాధ్యులను చేసి సస్పెండ్ చేస్తానని ప్రభాకర రెడ్డి హెచ్చరించారు.     రెవిన్యూ శాఖలో పనిచేసే వారికి గుర్తింపు,గౌరవం ఉంటుందని అన్నారు. రెవిన్యూ శాఖకు సంబందించి ప్రతీ విషయాన్ని క్షుణంగా నేర్చుకోవాలని, శాఖకు ఉన్నటువంటి సామర్ధ్యము, శక్తిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు,నూజివీడు సబ్ కలెక్టరు బచ్చు స్మరణ్ రాజ్,ఏలూరు ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యస్ కె.హభీబ్ భాషా,జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు,తహశీల్దార్లు,సర్వే అధికారులు,డిప్యూటీ తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

About Author