NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం..

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.గురువారం ఉదయం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని సయ్యద్ ఖైరున్ భీ ఇంటికి వెళ్లి సీఎం సహాయనిది 40 వేల చెక్కును లబ్ధిదారురాలికి ఎమ్మెల్యే అందజేశారు. తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎంపీటీసీ నారాయణ కుటుంబానికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు.రోగాలపట్ల అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ జరిగినట్లయితే ఆరోగ్యశ్రీ వర్తించని వారికి అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి వచ్చే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,ఖాతా రమేష్ రెడ్డి,మహబూబ్ బాష పాల్గొన్నారు.

About Author