రాష్ట్ర విద్యా,వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయండి
1 min read

పీడీఎస్ యూ భాస్కర్..
నందికొట్కూరు, న్యూస్ నేడు : వచ్చే నెల ఆగస్టు 4,5,6 తేదీల్లో నంద్యాల నగరంలో జరుగు పీడీఎస్ యూ రాష్ట్ర విద్యా,వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక నందికొట్కూరు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆఫీసులో విద్యార్థి నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించుకోవడం కోసం నంద్యాల నగరంలో జెకె ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర క్లాసులు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ క్లాసులకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరైతున్నారని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ, కాసాయికరణ చేయడానికి సిద్ధమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రాథమిక పాఠశాలలను మూసివేసే జీవో 19,20 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. యువగలం పాదయాత్రలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు నారా లోకేష్ తక్షణమే అమలు చేయాలని అన్నారు.పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేసే జీవో నెంబర్ 77ను ఎప్పుడు రద్దు చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు.రాష్ట్రవ్యాప్తంగా 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ధరలు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జూనైద్ బాష, నంద్యాల కార్యదర్శి రాంబాబు,రాష్ట్ర నాయకులు ఆది,రమణ,జగదీష్,జగన్, అజయ్,శ్యామ్ నాయక్ పాల్గొన్నారు.

