కార్గిల్ విజయ్ దివస్ ..మాజీ సైనికులకు సత్కారం..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: భారత సైనిక చరిత్ర లో అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒక్కటిగ గుర్తించి జులై 26 నా కార్గిల్ విజయ్ దివస్ ను ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. 2025 లో 1999 కార్గిల్ యుద్ధము లో విజయం సాధించి 26 వ వార్షికోత్సవాన్ని భారత ధేశమంతట జరుపుకుంటున్నాము. జమ్ము కశ్మీర్ లోని కార్గిల్ సెక్టార్ నందు నియంత్రణ రేఖా వెంబడి శత్రు సైనము భారత భూభాగములోకి చొరబడినప్పుడు మే1999 లో కార్గిల్ యుద్ధం ప్రారంభమైనది. ఈ యుద్ధమును ఆపరేషన్ విజయ్ గా ప్రకటించారు. ఈ ఆపరేషన్ లో భారత దేశము నుండి రెండులక్షల కంటే యెక్కువ మంది సైనికులు పాల్గొని చివరికి టైగర్ హిల్ మరియు టోలోలింగ్ వంటి కీలక శిఖరాలను తిరిగి 26 జూలై 1999 న సాధించిన్నాము. ఈ ఆపరేషన్ లో వీర మరణం పొందిన వీర సైనికులను స్మరించుకుంటూ, ఆపరేషన్ విజయ్ లో పాల్గొన్న మాజీ సైనికులను శాలువలు మరియు మేమేంటోలతో జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీమతి.ఎస్.ఆర్.రత్న రూత్ సత్కరించడమైనది.

