NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోని మున్సిపల్ ఎక్స్ అఫీషియో మెంబర్గా టీడీపీ ఎమ్మెల్సీ బిటి నాయుడు

1 min read

ఆదోని, న్యూస్​ నేడు:  ఆదోని మున్సిపల్ ఎక్స్ అఫీషియో మెంబర్గా టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడును నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ  పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేల కోట కింద రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీటీ నాయుడును ఆదోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రోటోకాల్ పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం రాత్రి ఉత్తర్వులు పంపడం జరిగింది. ఎమ్మెల్యేల కోటా  రెండవసారి బిటి నాయుడు ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. 2009, 2014 రెండుసార్లు కర్నూలు పార్లమెంట్ నుండి ఎంపీగా పోటీ చేసి, అనంతపురం జిల్లా టిడిపి ఇన్చార్జిగా, టిడిపి పార్టీలో రెండుసార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, వాల్మీకి బోయ ఫెడరేషన్ చైర్మన్గా, కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఉపనాయకుడిగా అప్పటి ప్రభుత్వం తీరుపై ఎనలేని పోరాటాలు చేసి పార్టీకి ఎనలేని సేవలు చేయడంతో టిడిపి జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  బిటి నాయుడు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రెండవసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఎం.ఏ, ఎల్.ఎల్.బి పూర్తిచేసి న్యాయవాది వృత్తిలో 20 ఏళ్లకు పైగా జిల్లా కోర్టు నుండి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా, విద్యావేత్తగా, మచ్చలేని రాజకీయ నాయకునిగా పార్టీకి విధేయుడుగా పనిచేయడంతోనే  టిడిపి పార్టీ చరిత్రలో వరుసగా రెండవసారి ఎమ్మెల్సీగా బిటి నాయుడుకు అవకాశం ఇచ్చి పార్టీ చరిత్ర తిరగ రాశారనీ చెప్పవచ్చు. పార్టీకి విధేయుడుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ బీటీ నాయుడును ఆదోనిని అభివృద్ధి పథంలో నడపాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదోని మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదోనినీ  అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, క్యాబినెట్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించుకునే నిబద్ధత, పట్టుదల కలిగిన ఎమ్మెల్సీ బీటీ నాయుడును ఆదోని మున్సిపల్ ఎక్స్ అఫీషియో మెంబర్గా నియమించడం పట్ల నియోజకవర్గంలోని ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, బిటి నాయుడు శ్రేయోభిలాషులు హర్ష వ్యక్తం చేస్తున్నారు.

About Author