NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉరుకుందకు ప్రత్యేక బస్సులు నడపాలి

1 min read

ఉరుకుంద కు స్పెషల్ పేరుతో అదనపు బస్సు చార్జీలు తగ్గించాలి… ఎమ్మిగనూరు కాంగ్రెస్  నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎం.కాసిం వలి

ఎమ్మిగనూరు , న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో శ్రావణమాసం ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ ప్రాంతాన వెలసిన శ్రీ   ఉరుకుందు ఈరన్న స్వామి దర్శనానికి లక్షలాదిమందిగా వెళ్తారని, శ్రావణమాసంలో ఉరుకుందకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని , స్పెషల్ పేరుతో అధిక చార్జీలు తగ్గించాలని కోరుతూ ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  ఎం.కాసిం వలి,ఎన్​ఎస్​యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ శనివారంన డిపో మేనేజర్  మద్దిలేటి నాయుడుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ భక్తులు మరియు ప్రయాణికులు సరైన సమయంలో బస్సు లేక ప్రైవేట్ వెహికల్ మరియు ఆటోలో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారని, దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు అధిక సంఖ్యలో నడపాలని కోరారు. అదేవిధంగా స్పెషల్ చార్జి పేరుతో 90 నుంచి 100 దాకా వసూలు చేయడం తగదని ప్రయాణికులకు పై అధిక భారం మోపడం తగదని తెలిపారు, యధా విధంగా నడుస్తున్న చార్జీలే వసూలు చేయాలని తెలిపారు. ఉరుకుందలో ప్రత్యేక ఆర్టీసీ సిబ్బందిని శిబిరాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు .పలు గ్రామీణ ప్రాంతాలకు కూడా నైట్ హోల్డ్ బస్సు సౌకర్యాలు కల్పించాలని, తెలిపారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్ ,రఫిక్నరసప్ప ,హజరత్ వలి ,అసిఫ్, హర్ష కుమార్, లోకేష్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author