NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టు పరిశ్రమ శాఖ – సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా పట్టు పరిశ్రమ శాఖ వారి కార్యాలయం నందు డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్, ఏ. పి గుంటూరు గారి ఆదేశాల మేరకు సమాచారం హక్కు చట్టం – 2005 పైన లాయర్ శ్రీ .అడిగ శ్రీధర్  అవగాహన సదస్సు నందు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి  శ్రీ. కె . నగేష్ జిల్లా పట్టు పరిశ్రమ అధికారి,నంద్యాల & సహాయ సంచాలకులు,ఆత్మకూరు వారు హాజరు అయ్యారు..ఈ కార్యక్రమంలో లాయర్ శ్రీధర్  విపులంగా సమాచార హక్కు చట్టం లోని అన్ని అంశాలను,ప్రభుత్వ ఉద్యోగులకు దాని ప్రాధాన్యత ,అందులోని సెక్షన్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగిని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన సమాచారం ఎలా ఇవ్వాలి,ఏమేమి ఇవ్వాలి, సి సి ఏ రూల్స్ మరియు ఇంకా ఎన్నో నూతన చట్టాలు గురించిన అంశాలను ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించడం జరిగినది.అలానే జిల్లా పట్టు పరిశ్రమ అధికారి గారు మాట్లాడుతూ సంచాలకుల వారి ఆదేశాల మేరకు పట్టు పరిశ్రమ శాఖలో తప్పని సరిగా సమాచార హక్కు చట్టం అమలు చేస్తూ సకాలం లో సమాచారం అందించాలని అన్నారు. ఈ అవగాహన సదస్సులో పట్టు పరిశ్రమ శాఖ అధికారులు,నంద్యాల పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది సుమారుగా 50 మంది పాల్గొన్నారు.

About Author